ఇలా చేస్తే చాలు నరాల నొప్పి, బలహీనత,నరాలలో అడ్డంకులు తగ్గటమే కాదు…జన్మలో ఉండవు
How to Treat Nerve Pain In telugu : కండరాల నొప్పి కంటే నరాల నొప్పి చాలా బాధాకరమైనది. మెదడు మరియు వెన్నుపూసలో సమస్య ఉన్నప్పుడు నరాల నొప్పి విపరీతంగా వస్తుంది. కండరాలు మరియు అవయవాల మధ్య నరాలలో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నొప్పులు వస్తాయి.
అంతేకాకుండా కొన్ని మందులు వాడటం,శరీరంలో విటమిన్ B1 లేదా B12 లోపం,డయాబెటిస్, నరాలకు రక్త సరఫరా తగ్గినప్పుడు,నరాల ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడూ నరాల బలహీనత,నరాల నొప్పి వంటివి వస్తాయి. ఈ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడూ డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు రాక్ సాల్ట్ చాలా మంచిది. ఎందుకంటే రాక్ సాల్ట్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉండుట వలన కండరాలు మరియు నరాలకు అవసరమైన మెగ్నీషియం అంది నొప్పి తగ్గుతుంది. స్నానం చేసే నీటిలో రాక్ సాల్ట్ వేసి స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే నరాల బలహీనత కూడా తగ్గుతుంది.
పసుపు కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మారిన పరిస్థితుల కారణంగా ఈ మధ్య కాలంలో పసుపు వాడకం కూడా చాలా ఎక్కువ అయింది. ఆయుర్వేదంలో పసుపుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన నరాలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.
ప్రతి రోజు ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పావు స్పూన్ లో సగం పసుపు మరియు చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. ఇలా ప్రతి రోజూ ఒక వారం రోజుల పాటు తాగడం వల్ల నరాల నొప్పి, నరాల బలహీనత తగ్గుతుంది. పసుపులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ నరాల సమస్యల నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే దీనిలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం సమృద్దిగా ఉన్నాయి. ఇది నరాలలో నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండుట వలన నరాల నొప్పిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. దీనిని వారంలో రెండు సార్లు తాగితే నరాల నొప్పి,నరాల బలహీనత వంటి అన్నీ రకాల నరాల సమస్యలను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా సులువుగానే లభ్యం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.