1 స్పూన్ తీసుకుంటే 20 ఏళ్లుగా ఉన్న థైరాయిడ్ సమస్య శాశ్వతంగా మాయం అవుతుంది
Thyroid reduced food In telugu :ఇటీవల కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. .
థైరాయిడ్ గ్రంధి అనేది మీ మెడ యొక్క బేస్ వద్ద కనిపించే ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఈ శక్తివంతమైన గ్రంధి ఒక విధమైన నియంత్రణ కేంద్రంగా చెప్పవచ్చు. అనేక శరీర ప్రక్రియలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
థైరాయిడ్ సమస్య ను తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. 50 గ్రాముల వాల్ నట్స్ తీసుకోవాలి. వాల్ నట్స్ లో అసంతృప్త లిపిడ్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఎ మరియు ఇ సమృద్దిగా ఉంటాయి. ఒక బౌల్ లో వాల్ నట్స్ వేసి నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి.
బాగా నానిన వాల్ నట్స్ ని ఆరబెట్టాలి. ఆరిన వాల్ నట్స్ ని మిక్సీ జార్ లో మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల buckwheat తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. buckwheat లో ఇనుము, కాల్షియం, అయోడిన్, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.
అలాగే విటమిన్ లు A, D, C, E, B1, B2, B3, B5, B6, B9 (ఫోలిక్ యాసిడ్), P (రుటిన్), PP (నికోటినిక్ యాసిడ్) సమృద్దిగా ఉంటాయి. ఒక గాజు సీసాలో వాల్ నట్స్ పొడి, buckwheat పొడి, 100 గ్రాముల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉంటే క్రమంగా థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.