ఈ సీజన్ లో డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు
Dragon fruit benefits In Telugu : డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కప్పుడు చాలా అరుదుగా లభించినా…ప్రస్తుతం చాలా విరివిగానే లభిస్తోంది. కాస్త ధర ఎక్కువ అయినా దానికి తగ్గట్టుగానే మన శరీరానికి పోషకాలను అందిస్తుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి.
డ్రాగన్ ఫ్రూట్ లో శరీరానికి శక్తినిచ్చే ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి3 విటమిన్స్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలలో ఒమేగా -3, ఒమేగా -9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఇవి మన శరీరంలో ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కొరకు ఈ ఫ్రూట్ సహాయపడుతుంది. ఈ సీజన్ లో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ
ఆర్థరైటిస్ నొప్పి.. ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే మెగ్నీషియం మరియు కాల్షియం శరీరంలోని ఎముకల ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తాయి.
అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతి రోజు అరకప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను తింటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడతారు. అంతేకాకుండా విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.