ఈ ఆకు నిజంగా బంగారం లాంటిదే…ఎన్ని ప్రయోజనాలో…అసలు నమ్మలేరు
Is it good to eat lemon leaves : :మనం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ .మనం నిమ్మ ఆకులు గురించి పెద్దగా పట్టించుకోము. నిమ్మ ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
నిమ్మ ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు సహాయపడతాయి. నిమ్మ ఆకులు చేదుగా ఉంటాయని తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. నిమ్మ ఆకులను తినటం లేదా వాటి రసాన్ని తీసుకోవటం…లేదా వాటి వాసన చూడటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే నిమ్మ ఆకులను టీ లేదా జ్యూస్ వంటి వాటిలో వేసుకొని తీసుకోవాలి.
నిమ్మ ఆకులలో యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్, ఆల్కలాయిడ్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ మరియు ఫినాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనితో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు వంటి పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి.
నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా మరియు పెరగకుండా నిరోధిస్తుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి నిమ్మ ఆకులు మేలు చేస్తాయి. నిజానికి నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. శరీరం యొక్క ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది.
మైగ్రేన్ మరియు మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి నిమ్మ ఆకుల వాసన చూస్తే తగ్గుతాయని నిపుణులు చెప్పుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి. నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు ఆల్కలాయిడ్స్ మంచి నిద్రకు సహాయపడతాయి.
బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి నిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి. నిమ్మ ఆకుల నుండి తయారైన జ్యూస్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది బరువును తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది . నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. నిమ్మ ఆకుల్లో క్రిమిసంహారక గుణాలు ఉండుట వలన కడుపులోని నులిపురుగులను నివారిస్తుంది. నిమ్మ ఆకు రసంలో తేనె కలిపి తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.