కొబ్బరి పాల టీని ఎప్పుడైనా తాగారా…మిస్ అయితే ఈ లాభాలను కోల్పోయినట్టే…!
Coconut Milk Tea Benefits In Telugu : ప్రతి రోజు మనం కొబ్బరిని పచ్చడి, కూరల్లో వేసుకోవటం, స్వీట్ ల తయారీలో…ఇలా ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. మనం ఉదయం లేవగానే టీ తాగితేనే రోజంతా హుషారుగా ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే టీ తాగకపోతే రోజు గడవదు.
అలాంటి టీని కొబ్బరి పాలతో తయారుచేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిలో సంతృప్త కొవ్వు పదార్థాలు, లారీక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇక కొబ్బరి టీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
పొయ్యి మీద గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీటిని పోయాలి. ఆ తర్వాత మూడు గ్రీన్ టీ బ్యాగులు వెయ్యాలి. ఆ తర్వాత అర కప్పు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల క్రీం వేసి బాగా కలపాలి. 2 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్స్ తీసేసి ఈ టీ ని వడకట్టి తాగాలి. రుచికి అవసరం అనుకుంటే కొంచెం పటికబెల్లం వేసుకోవచ్చు.
ఈ టీ తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎందుకంటే కొబ్బరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరం యొక్క .జీవక్రియను ప్రోత్సహించి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి అధిక బరువు సమస్య నుంచి బయట పడటానికి సహాయపడుతుంది.
కొబ్బరిలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. అయితే కొబ్బరి టీ ని ఎక్కువగా తాగితే జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, తల్లిపాలు ఇచ్చే మహిళలు ఎక్కువగా కొబ్బరి టీ తాగకుండా ఉంటేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.