Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు 2 స్పూన్ల గింజలను తింటే…ముఖ్యంగా మతిమరుపు ఉన్నవారికి…

Peanuts Health benefits In Telugu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలలో వేరుశనగ ఒకటి. పేదవాని బాదంగా పిలిచే వేరుశనగలో దాదాపుగా బాదంలో ఉండే అన్నీ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే…
peanuts side effects
ఈ గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వలన గుండెపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. వేరుశెనగలో కరిగే ఫైబర్ మరియు ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
Weight Loss tips in telugu
వేరుశనగ తినటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలనే ప్రణాళిక ఉన్నవారు తింటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Diabetes diet in telugu
ఎందుకంటే వేరుశనగలో చక్కెర మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం తక్కువగా ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. వేరుశనగల్లో ఉండే అమినో యాసిడ్స్ మెదుడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేసి మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయ పడుతుంది. దాంతో మతిమరుపు సమస్యలు ఉండవు.
Brain Foods
వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వేరుశనగలో calcium, vitamin K సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు అవసరమైన బలాన్ని ఇచ్చి ఎముకలు గుల్లగా మారకుండా కాపాడతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారిలో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.