Healthhealth tips in telugu

1 గ్లాస్ ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Lemon Weight Loss Drink In Telugu : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. బరువు తగ్గించుకోవడానికి రక రకాల వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం లేక చాలా నిరాశ పడిపోతారు. దాంతో మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంటిలోనే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసుకున్న డ్రింక్ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే జీవక్రియ రేటు పెరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి 7 నిమ్మకాయలను కట్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి.

జ్యూస్ తీసిన నిమ్మ తొక్కలను పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి నాలుగు గ్లాసుల నీటిని పోసి దానిలో నిమ్మ తొక్కలు, రెండు దాల్చిన చెక్క పెద్ద ముక్కలను వేయాలి. ఆ తర్వాత మూడు స్పూన్ల కాఫీ పొడి వేయాలి. దాదాపుగా 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టాలి. .
Weight Loss tips in telugu
దీనిలో ముందుగా తీసి పెట్టుకున్నా నిమ్మరసం కలపాలి. ఈ డ్రింక్ ని ఒక సీసాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు తాగవచ్చు. రోజుకి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఉదయం పరగడుపున లేదా సాయంత్రం నాలుగు గంటలకు లేదంటే రాత్రి భోజనం అయిన రెండు గంటల తర్వాత తీసుకోవాలి. అవసరమైతే తేనె కలుపుకొని తాగవచ్చు.
Honey benefits in telugu
ఈ విధంగా నెల రోజులు పాటు ఈ డ్రింక్ తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అయితే ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తేనే తొందరగా మంచి ఫలితం ఉంటుంది. ఈ డ్రింక్ ఉదయం సమయంలో తాగితే నీరసం,అలసట ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.