Beauty Tips

Hair Care Tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే ఈ నూనె రాస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా చాలా స్పీడ్ గా పెరుగుతుంది

Neem Hair Fall Home Remedies In telugu : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మనలో చాలా. మంది మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు.. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Neem leaves benefits
అలా కాకుండా మనం ఇంటిలో తయారు చేసుకునే నూనెను వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. మిక్సీ జార్ లో గుప్పెడు వేపాకులు, గుప్పెడు కరివేపాకు, రెండు స్పూన్ల మెంతులు వేసి మిక్సీ చేసుకోని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 100 Ml కొబ్బరినూనె తీసుకొని దానిలో మిక్సీ చేసిన మిశ్రమాన్ని వేయాలి.
curry leaves
ఇప్పుడు ఈ గిన్నెను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఆ తర్వాత ఈ నూనె కాస్త చల్లారాక గాజు సీసాలోకి వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
fenugreek seeds
వేపాకులలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మెంతులలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండేలా చేయటమే కాకుండా మంచి కండిషనర్ గా కూడా సహాయపడుతుంది.

ఇక కరివేపాకు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడతాయి. కాబట్టి ఈ నూనెను వారంలో రెండు సార్లు వాడితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.