Healthhealth tips in telugu

పావు స్పూన్ చాలు శరీరంలో నరాలు,మెదడులో నరాలు యాక్టివ్ అయ్యి నరాల బలహీనత ఉండదు

Nerve Weakness Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ వంటివి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. నరాల బలహీనత లేకుండా నరాలు యాక్టివ్ గా ఉండేలా చేయడానికి ఇప్పుడు చెప్పే పొడి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
Ashwagandha
ఆ పొడి Ashwagandha పొడి. ఇది అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది. Ashwagandha పొడి ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. మనలో మానసిక ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ వంటివి ఉన్నప్పుడు కాటిజాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ను స్ట్రెస్ హార్మోన్ అని అంటారు.
Ashwagandha-powder
ఈ హార్మోన్ ఎంత ఎక్కువ విడుదల అయితే మనకు స్ట్రెస్ అంత ఎక్కువగా ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయి బ్యాడ్ హార్మోన్స్ పెరిగిపోతాయి. దాంతో శరీరంలో అనేక రకాల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి.ఈ ఒత్తిడి హార్మోన్ ని తగ్గించడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది.
ఇది నరాల యొక్క యాక్టివిటీని స్టిములేట్ చేసి మెదడుకు రిలాక్స్ కలిగించేలా చేస్తుంది.

శారీరకంగాను,మానసికంగాను బలంగా ఉండటానికి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అయితే అశ్వగంధ పొడిని పావు స్పూన్ మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగవచ్చు. ఈ విధంగా 15 రోజుల పాటు వాడితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

అశ్వగంధ శరీరం అంతటా నాడీ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అశ్వగంధ నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే నాడీ వ్యవస్థ నష్టాన్ని నయం చేసే శరీర సామర్థ్యాన్ని ప్రేరేపిస్తుంది. దాంతో నరాలకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. అల్జీమర్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.