Healthhealth tips in telugu

ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

Heart healthy foods In Telugu : మనిషి శరీరంలో ముఖ్యమైన మరియు సున్నితమైన అవయవం గుండె. గుండెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావటానికి జీవనశైలి బిజీగా మారటం,సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం మరియు పోషకారాహాన్ని వదిలి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వంటివి కారణాలుగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

చేప: ఇందులో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఎక్కువగా ఉంటాయి. సల్మాన్, టూనా, హెర్రింగ్, మాకేరెల్, ట్రౌట్ రకాల చేపల్లో ఈ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. .ఇవి చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తసరఫరా బాగా జరిగేలా చేస్తుంది.

ఓట్స్: శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువైతే గుండెకు ప్రమాదం. ఓట్స్‌లో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ని తొలగిస్తుంది. శరీరంలో కొలెస్టరాల్ తగ్గించేందుకు ఓట్స్ ఉపయోగపడతాయి

నట్స్: నట్స్ లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి మీ గుండెకు మేలు చేస్తాయి. గుండెలోని ధమనుల వాపు సమస్యను తగ్గిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

బెర్రీలు: ఇందులో గుండెకు మేలు చేసే పెతోన్యూట్రియంట్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీస్ వంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే గుండెకు మంచిది. రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

కూరగాయలు:కూరగాయల్లో ఉండే కెరోటినాయిడ్‌లు, విటమిన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్ – ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తాయి. ప్రతిరోజూ ఒక్క గ్లాసెడు ఆరెంజ్ జ్యూస్ త్రాగితే గుండె ఆరోగ్యానికి మంచిది.

వెల్లుల్లి – వెల్లుల్లిలో మంచి కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలలోని లోపలి అంచులు గట్టి పడకుండా చేస్తుంది. రక్తనాళాలు కొల్లెస్టరాల్ రహితంగా చేయటమే కాకుండా శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఎంతో మేలని వైద్య నిపుణులు అంటున్నారు.

పెసలు
రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించివేయడంలో పెసలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజు పెసలను నానబెట్టుకుని మొలకెత్తించి లేదా ఉడకబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దాంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

అవిసే గింజలు
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అవిసె గింజలను నీటిలో నానబెట్టుకుని తినవచ్చు. లేదా పొడి చేసుకొని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.