వారంలో 2 సార్లు ఈ రొట్టెలను తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
strong bones and sharp mind Recipes : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు,ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొనే ఒక రొట్టె గురించి తెలుసుకుందాం.
ఒక కప్పు బియ్యం పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఒక కప్పు జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ అల్లం పేస్ట్, సరిపడా ఉప్పు, రెండు రెబ్బల కరివేపాకు, రెండు స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు Dill leaves, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
ఆ తర్వాత మూడు స్పూన్ల కొబ్బరి తురుము వేసి నీటిని పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంను పది నిమిషాలు అయ్యాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ ముద్దలను తడిపిన ఒక వస్త్రం మీద పలుచగా వత్తి పాన్ మీద వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చాలి.
ఈ రొట్టెలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు. అలాగే మెదడు షార్ప్ గా పనిచేసి మతిమరుపు సమస్యలు ఉండవు. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఈ విధంగా వారంలో 2 సార్లు ఈ రొట్టెలను తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ రొట్టెలు చేసుకోవటం చాలా సులభం. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.