ఈ పువ్వును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో..అసలు మిస్ కావద్దు
Banana Flower Benefits In Telugu :అరటి పండు అంటే అందరికి తెలిసిన న్యూట్రీషియన్ ఫుడ్. అరటి పండును అందించే అరటి చెట్టులో అరటి పువ్వు,అరటి దూట వంటి వాటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మందికి అరటి పువ్వు గురించి తెలియదు. అరటి పువ్వును పచ్చిగా తినకూడదు.
కూర చేసుకొని మాత్రమే తినాలి. అరటి పువ్వులో న్యూట్రీషన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి . అరటి పువ్వులో ప్రోటీన్స్, క్యాలరీలు, ఫ్యాట్, ఫైబర్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అరటి పువ్వును తీసుకోవటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.
అరటిపువ్వులో ఎథనోల్ వంటి ఎక్స్ట ట్రాక్ట్స్ ఉండుట వలన బ్యాక్టీరియాను నివారిస్తుంది. గాయాలను తగ్గించటంలో సహాయపడతాయి. అరటి పువ్వు రసం మలేరియా ప్యారాసైట్ ప్లాస్మోడియంను ఫాల్సిపెరమ్ ను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది.అరటి పువ్వు రసంలో ఉండే మెథనోల్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తరిమి కొట్టటంలో సహాయపడతాయి.
దాంతో కొన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసినట్టే. ప్రీమెచ్యుర్ ఏజింగ్, మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.అరటిపువ్వు తీసుకోవటం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అదే విధంగా యాంటీమైక్రోబయల్ లక్షణాలు, హైపోగ్లిసిమిక్ లక్షణాలు, క్లీనికల్ గా మంచి ప్రభావం ఉన్నట్లు కనుగొన్నారు.
అరటిపువ్వులో విటమిన్స్ ఎ, సి, మరియు ఇ, పొటాషియం, ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన మంచి న్యూట్రీషియన్ ఆహారంగా చెప్పవచ్చు. అరటి పువ్వులో యాంటీ డిప్రెజెంట్స్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ఆందోళన ఉన్నప్పుడు అరటి పువ్వును తింటే ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అరటి పువ్వులో ఉండే సహజసిద్ధమైన యాంటీ డిప్రెజెంట్స్ లక్షణాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆందోళనను తగ్గిస్తుంది.
బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కొత్తగా తల్లైన వారు పాల పడటం లేదని చాలా బాధపడుతుంటారు. బిడ్డకు సరిపడా పాలు అందివ్వాలంటే, రెగ్యులర్ డైట్ లో అరటి పువ్వును చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు, బిడ్డకు కూడా ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటి పువ్వును అసలు మిస్ కాకుండా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.