అరస్పూన్ 1 రోజులో పిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు,జలుబు,జ్వరం,గొంతులో శ్లేష్మం నుండి విముక్తి
Immunity In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది అలాగే దగ్గు గొంతులో శ్లేష్మం తగ్గించుకోవడానికి ఈ రోజు ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి ఏ సమస్యలు ఉండవు
ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో తెలిసిపోయింది. ఆ కారణంగానే మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి. జలుబు, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే చాలా వాటిల్లో సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి.
అందులో దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్క, తేనె కలిపిన మిశ్రమం చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను మంచి వాసన వచ్చే వరకు వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి మూడు స్పూన్ల తేనె కలిపి పెద్దవారు అయితే రోజులో అరస్పూన్,చిన్న వారైతే పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది.
దాల్చిన చెక్క,తేనె మిశ్రమం శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. ఈ సీజన్ లో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దాల్చిన చెక్క పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకున్న పొడి అయితే మంచిది.
ఇక తేనె విషయానికి వస్తే ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి గంట అలా వదిలేసి…ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా ఉదయం, ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తే చాలా తొందరగా ఫలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.