ఈ ఆకులతో టీ తయారుచేసుకొని తాగితే…ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. తెలిస్తే ఇప్పుడే తాగటం స్టార్ట్ చేస్తారు..
Tulasi Tea Benefits In Telugu : ఈ ఆకులను మనం ప్రతి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ప్రతి ఇంటిలో దాదాపుగా తులసి మొక్క ఉంటుంది. తులసిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. .
తులసిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. తులసి ఆకులతో టీ తయారు చేసుకొని తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. తులసిలో యాంటీ ఆర్థరైటిస్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. తులసి టీ తయారుచేయటం చాలా సులువు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచిది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 10 తాజా తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి ఒక స్పూను తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ టీ ని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
తులసి తో తయారు చేసిన టి తాగితే యాంటీ-స్ట్రెస్ డ్రెస్ గా పని చేస్తుంది. అలాగే లభించే పొటాషియం అనేది మెదడులోని సెరోటినిన్ లెవల్స్ ని పెంచి డిప్రెషన్,ఒత్తిడి వంటి వాటిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఈ టీలో ఉండే యాంటీవైరల్ లక్షణాలు సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,శ్వాస కోశ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఈ టీ తాగితే…ఈ టీలోని స్టిమ్యులేటింగ్ గుణాలు మనసును రిలాక్స్ చేసి గాఢనిద్రలోకి వెళ్లేలా చేస్తాయి. యాంటీ ఫంగల్ లక్షణాలు దంత సమస్యలను తగ్గించటమే కాకుండా నోటి దుర్వాసన తగ్గేలా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.