Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు క్యాబేజీ తింటే ఏమి అవుతుందో తెలుసా?

cabbage good for diabetics in Telugu : క్యాబేజీలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు క్యాబేజీ తింటే చాలా మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Cabbage side effects in telugu
మారిన జీవనశైలితో పాటు, జంక్ ఫుడ్ మరియు అధిక నూనెల వినియోగం కారణంగా డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండటానికి ముందే జాగ్రత్త పడటం మంచిది. క్యాబేజీలో విటమిన్ కె, విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం, కరిగే ఫైబర్, కాపర్ వంటివి సమృద్దిగా ఉంటాయి.
Diabetes diet in telugu
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా వాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన ఆహారం తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు వారంలో రెండు సార్లు తప్పనిసరిగా క్యాబేజీ తినాలని నిపుణులు చెప్పుతున్నారు. క్యాబేజీ అత్యల్ప గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది.
Cabbage Water benefits In telugu
ముఖ్యంగా క్యాబేజీలో ఉండే బెటాలైన్ అనే సహజ పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచు తుంది. దాంతో డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు పెరిగే కొద్దీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. వాటిని బయటకు పంపటానికి కిడ్నీలు ప్రయత్నిస్తాయి.
kidney problems
దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కిడ్నీల పనితీరు కష్టమవుతుంది. ఆ కారణంతో డయాబెటిస్ ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్యాబేజీని తినటం అలవాటుగా చేసుకోవాలి.
gas troble home remedies
ఎందుకంటే క్యాబేజీలో విటమిన్ సి మరియు ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి, జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా నిర్వహించబడుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది. క్యాబేజీలో సెలీనియం అనే సహజ మూలకం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఇలా డయాబెటిక్ పేషెంట్లు క్యాబేజీని ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు , పక్షవాతం, రక్తపోటు వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా వారంలో రెండు సార్లు క్యాబేజీని తినటానికి ప్రయత్నం చేయండి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.