ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటున్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…నమ్మలేరు
Oats Health Benefits in Telugu : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మనలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెడుతున్నారు.అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఉదయం సమయంలో ఓట్స్ తో బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణ ఉండేలా చేస్తుంది.
ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తుంది. అధిక బరువు సమస్య లేకుండా చేస్తుంది. అధికబరువు సమస్య ఉన్న వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా మంచిది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఆస్తమా ఉన్నవారిలో కూడా చాలా మంచి ఫలితాన్ని అంధిస్తుంది.ఇప్పుడు వానలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆస్తమా అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ చలికాలంలో ఓట్స్ తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఓట్స్‌లో విటమిన్ బి ( Vitamine B ) సహజంగా లభిస్తుంది. కార్పోహైడేట్లు, ప్రోటీన్స్, మినరల్స్ సమృద్దిగా ఉండుట వలన నరాల బలహీనతతో పాటు నిస్సత్తువను పారద్రోలుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఓట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి ఒట్స్ మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు