Bigg Boss 6 telugu చంటి ఐదు వారాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
Bigg Boss 6 Telugu Chanti remuneration : Bigg Boss సీజన్ 6 ప్రారంభం అయ్యి అయిదు వారాలను పూర్తి చేసుకుని ఆరో వారంలోనికి ఎంటర్ అయింది. ఐదో వారం అందరూ ఊహించిన విధంగానే చలాకీ చంటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చలాకి చంటి అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు.
బిగ్ బాస్ హౌస్ లో చంటి ఎక్కువ వారాల సమయం ఉంటాడని అభిమానులు ఆశించారు. అయితే కేవలం 5 వారాలకు మాత్రమే హౌస్ లో కొనసాగారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక చలాకి చంటి గురించి ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో చంటి కొనసాగినందుకు తీసుకున్న పారితోషకం పై రకరకాల వార్తలు వస్తున్నాయి.
.
సోషల్ మీడియా కథనాల ప్రకారం చంటి బిగ్ బాస్ హౌస్ లో చంటి ఉన్నందుకు వారానికి 1.5నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈయన 5 వారాలకు గాను ఏడు నుంచి పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.