ఈ నూనె రాస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది…ముఖ్యంగా ఈ సీజన్ లో
Hair Fall Tips In telugu ; ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టు పట్ల శ్రద్ధ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తుంది. జుట్టు రాలే సమస్య రాగానే మనలో చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. .
వాటిలో ఉండే కొన్ని కెమికల్స్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే నూనె తయారు చేసుకుని వారంలో మూడు సార్లు రాస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె తయారీ కోసం రెండు కలబంద మట్టలను తెచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలను వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనె వేసి మరిగించాలి.. ఎక్కువసేపు మరిగించకూడదు. నూనె గ్రీన్ కలర్ లాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ నూనె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎక్కువగా మరిగించడం వలన అలోవెరా లో ఉన్న పోషకాలు అన్ని పోతాయి. కాబట్టి ఈ నూనెను ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం మంచిది. .
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి అరగంట అయ్యాక తల స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు మృదువుగా పొడవుగా పెరుగుతుంది. అలోవెరా లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అధికంగా ఉంటాయి. అలాగే జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టు రాలకుండా అడ్డుకుంటుంది. .
అలోవెరా జుట్టుకు తేమనుఅందించి జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. స్కాల్ప్ మీద దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెను అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.