ఈ డ్రింక్ 15 రోజుల్లో బరువును,పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును మైనంలా కరిగిస్తుంది
Weight Loss Tea Benefits In telugu : ఈ మధ్య కాలంలో బరువు తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, సరైన వ్యాయామం లేకపోవడం, హార్మోన్స్ ఆసమతుల్యత, కొన్ని రకాల మందులు వాడటం, ఒత్తిడి వంటి కొన్ని రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. .
అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గటానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 10 తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. .పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 10 తులసి ఆకులు, రెండు అనాస పువ్వులు, కొద్దిగా డ్రై లెమన్ గ్రాస్ వేసి ఏడు నుంచి తొమ్మిది నిమిషాల పాటు మరిగించాలి. .
ఇలా మరిగించిన నీటిని వడగట్టి అర స్పూను తేనె కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో క్యాలరీలు, కొవ్వు చాలా త్వరగా కరిగి చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి. బరువు తగ్గటానికి తులసి చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను, కొవ్వు స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అనాస పువ్వును బిర్యానీ, పులావ్ మరియు మసాలా కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.
అయితే శరీరంలో కొవ్వు వేగంగా కరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక లెమన్ గ్రాస్ విషయానికి వస్తే తాజా లెమన్ గ్రాస్ ని కూడా ఉపయోగించవచ్చు. తాజా లెమన్ గ్రాస్ దొరక్కపోతే డ్రై లెమన్ గ్రాస్ ఉపయోగించవచ్చు. ఇలాంటి డ్రింక్స్ ని తాగుతూ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గటానికి ప్రయత్నం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.