ఈ పొడిలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
cloves and honey benefits : లవంగాలు,తేనెలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తేనె,లవంగాలు రెండింటిలోను యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియాల్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.
దగ్గు,జలుబు,గొంతు నొప్పి తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. మూడు లవంగాలను మెత్తని పొడిగా చేసి ఒక స్పూన్ తేనెలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన గొంతు ఇన్ ఫెక్షన్ తగ్గి గొంతు నొప్పి,దగ్గు,జలుబు అన్నీ తగ్గిపోతాయి. కాలేయంనకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
లవంగాలలో ఉండే ‘యూజినాల్’ అనే సమ్మేళనం కాలేయానికి మేలు చేస్తుంది.జీవక్రియలను మెరుగుపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణ సమస్యలు లేకుండా చేయటమే కాకుండా బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. లవంగాలు ఆకలిని తగ్గించి శరీరంలో కొవ్వు కరగటానికి సహాయపడుతుంది.
నోటి పూతను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. తేనె,లవంగాల మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చర్మ సమస్యలను తగ్గించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. లవంగాలలో యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
ఇది బ్యాక్టీరియా దాడి నుండి చర్మాన్ని కాపాడుతుంది. తేనె ముఖాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడి మరియు జిడ్డుగల చర్మానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. లవంగాల పొడిలో తేనె కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.