Healthhealth tips in telugu

పచ్చిగా ఉన్నప్పుడే రసం తీసి తేనె కలిపి తీసుకుంటే పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు పోతుంది

Ginger and Honey Benefits In telugu : జీర్ణ సమస్యలు తగ్గించటానికి మరియు ఆకలి లేనివారిలో ఆకలి పుట్టించటానికి, సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. మనం ప్రతి రోజు అల్లం వంటల్లో వాడుతూ ఉంటాం. అల్లంను పచ్చిగా ఉన్నప్పుడే దంచి రసం తీయాలి.
Ginger benefits in telugu
ఒక బౌల్ లో అరస్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అల్లంలో ఉండే జింజీరాల్ అనేది అన్నీ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Honey
గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం సమస్యలను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. అల్లం,తేనె రెండింటిలోను యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది.

అల్లం,తేనె గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడి రక్తనాళల్లో రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అల్లం,తేనె మిశ్రమాన్ని సహజసిద్దమైన పెయిన్ కిల్లర్ గా చెప్పవచ్చు.
Acidity home remedies
నొప్పుల ఉపశమనం కొరకు బాగా సహాయపడుతుంది. సైనస్‌ నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా శ్వాసకోశం నుండి శ్లేష్మం కరిగించటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సీజన్ లో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. అన్నీ సమస్యల నుండి బయట పడటానికి అల్లం,తేనె మిశ్రమాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.