కేవలం 2 సార్లు చాలు …రెట్టింపు వేగంతో కొవ్వు కరిగి పొట్ట తగ్గి బరువు తగ్గటం ఖాయం
Tulasi weight Loss Tips : ఈ మధ్య కాలంలో అధిక బరువు, శరీరంలో కొవ్వు పేరుకుపోవటం వంటి సమస్యలు వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఒక సాదారణ సమస్యగా మారిపోయింది. మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అదే మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ నీటిని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి 6 తులసి ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత నిమ్మకాయలో సగం ముక్కను నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి.
ఈ మిశ్రమం 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగితే తులసి,నిమ్మలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయం,సాయంత్రం రోజులో రెండు సార్లు తాగితే తొందరగా ఫలితం కనపడుతుంది.
ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉండాలి. బరువు అనేది ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఒక పద్దతి ప్రకారం ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే తగ్గాలి. ఈ డ్రింక్ తాగుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఉంటే 15 రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.
శరీర జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. అంతేకాదు, మెటబాలిజం వేగవంతమై క్యాలరీలు చాలా వేగంగా ఖర్చవుతాయి. దీంతో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే కరిగి బరువు తగ్గిపోతారు. అధిక బరువుతో పాటు పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలోనూ నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే తులసి కూడా బరువు తగ్గించటంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.