ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది
Joint pains Home remedies in telugu : కీళ్ల మధ్య జిగురు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారటం మరియు నొప్పులు వస్తాయి. నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు చేతులు మరియు కాళ్ళ కీళ్లలో నొప్పి, ఎముకలు దృఢంగా లేకపోవటం, ఎముకలు బలహీనంగా ఉండటం వంటివి కీళ్లనొప్పులకు సంకేతాలుగా భావించాలి.
ఎముక కీళ్ల మధ్య మృదులాస్థి ఉంటుంది. ఈ మృదులాస్థి అరిగినప్పుడు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్య చాలా తీవ్రం అయ్యి విపరీతమైన నొప్పులకు కారణం అవుతుంది. ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
బీన్స్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్, ఖనిజాలు మరియు ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. బీన్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వారంలో రెండు సార్లు బీన్స్ ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఎముకలు మరియు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో అల్లం చేర్చడం మంచిది. అల్లంను చిన్న ముక్క తీసుకొని బుగ్గన పెట్టుకొని నమిలి తినవచ్చు…లేదంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకోవచ్చు.
వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు ఆహారానికి భిన్నమైన రుచిని ఇస్తాయి. ఈ రెండింటిలోను సల్ఫర్ సమృద్దిగా ఉండుట వలన వాపు మరియు నొప్పితో పోరాటం చేస్తుంది. కీళ్లను బలంగా మరియు ఫ్లెక్సిబుల్‌గా ఉంచటానికి ప్రతి రోజు వెల్లుల్లి, ఉల్లిపాయను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.