Healthhealth tips in telugu

రోజుకి గుప్పెడు తింటే చాలు అధిక రక్తపోటు, డయాబెటిస్,రక్తహీనత సమస్యలు అసలు ఉండవు

Pearl Millet Benefits In Telugu : చిరుధాన్యాలలో ఒకటైన సజ్జలను పురాతన కాలం నుండి వాడుతున్నారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చిరుధాన్యాల వైపు చూస్తున్నారు. సజ్జలను రోజుకి గుప్పెడు తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగు తాయి.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తాయి.
sajjalu beenfits
సజ్జలలో ఉండే కార్బోహైడ్రేడ్స్ నిదానంగా జీర్ణం అయ్యి రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను నిర్వహించటంలో సహాయపడతాయి. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని మరియు ట్రైగ్లిజరైడ్స్ ని తొలగిస్తుంది. పొటాషియం రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
సజ్జలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేయటమే కాకుండా అలసట,నీరసం,నిసత్తువ వంటివి లేకుండా చేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు అసలు ఉండవు.
Brain Foods
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి వాటిని నయం చేయటంలో సహాయపడతాయి. బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. సజ్జలలో ఉండే ఫాస్ఫరస్ ఎముకలను బలంగా చేస్తుంది.
Diabetes diet in telugu
సజ్జలలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. సజ్జలలో విటమిన్ A మరియు జింక్‌ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు సహాయపడి వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.