Healthhealth tips in telugu

1 గ్లాసు 15 రోజుల్లో బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

Pudina Weight Loss Drink In telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చోవటం, సరైన పోషకాలు తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Pudina Health benefits in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 5 లవంగాలు, నిమ్మకాయలో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నిమిషాలు మరిగాక 15 పుదీనా ఆకులను వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు ఉదయం సమయంలో తాగాలి. రుచి కోసం అరస్పూన్ తేనె కలపవచ్చు.
Cloves water Health benefits In telugu
డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. లవంగాలు జీవక్రియ రేటును పెంచి కొవ్వు వేగంగా కరగటానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గించటానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
పుదీనాలో ఉన్న లక్షణాలు బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే కేవలం 15 రోజుల్లోనే బరువు తగ్గటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు, గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి కూడా తగ్గుతాయి.

సీజన్ మారినప్పుడు జలుబు,గొంతు నొప్పి వచ్చాయంటే ఒక పట్టానా తగ్గవు. వాటిని తగ్గించుకోవటానికి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగితే అధిక బరువు తగ్గటమే కాకుండా సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.