వారంలో 2 సార్లు – కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు,రక్తహీనత,డయాబెటిస్,అధిక బరువు ఉండవు
Chama Dumpa Health Benefits in Telugu :ఆసియా దేశాల్లోనే పుట్టిన చామ దుంప ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. భారతదేశంలో పెద్ద ఎత్తునే చామను సాగు చేస్తున్నారు. చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నేలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుత్తులుగా చామ దుంపలు పెరుగుతాయి.
చామను నేరుగా తింటే నోరు దురద వస్తుంది. అందువల్ల ఉడకబెట్టి, పులుసుగా, కూరగా వండి చామను తింటూ ఉంటారు. కొంతమంది చామ దుంప దురద వస్తుందని తినటానికి ఆసక్తి చూపరు. కానీ వాటిల్లో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా తినటం అలవాటు చేసుకుంటారు.
ఇక పోషకాల విషయానికి వస్తే… చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు సమృద్దిగా ఉంటాయి.
చామ దుంప డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్ జీర్ణప్రక్రియను స్లో చేస్తుంది. దాంతో, శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది.రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి గ్లైసెమిక్ నియంత్రణ సాధ్యమవుతుంది.
అలాగే అధిక బరువు ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేయటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.
కాపర్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి చామదుంప మంచి ఎంపిక అని చెప్పవచ్చు
పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో కణాల ఫంక్షన్ నార్మల్ గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో సోడియం నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గించటానికి సహాయపడుతుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. కళ్ళు పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తుంది
మెగ్నీషియం, ఐరన్, Calcium సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలు గుళ్ల బారటం, పేలుసుగా మారటం వంటి సమస్యలు ఉండవు
ఇన్ని ప్రయోజనాలు ఉన్న చామదుంపను మిస్ కాకుండా తినడం అలవాటు చేసుకోండి. చామదుంప సంవత్సరం పొడవునా విరివిగానే లభ్యం అవుతుంది. కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.