ఈ పిండి అందరికీ తెలుసు…కానీ ఈ పిండిలో ఉన్న ఆ రహస్యం మాత్రం ఎవరికి తెలియదు
Jonna Pindi benefits in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గాల కోసం అన్వేషణ చేస్తూ వాటిని పాటిస్తున్నారు. మన పెద్దలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కోసం జొన్నలు వంటి చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు. మరల ఇప్పుడు ఆ చిరుధాన్యాలను తీసుకోవటం ఎక్కువయింది
ఈరోజు జొన్న పిండి గురించి తెలుసుకుందాం. జొన్న పిండిలో ఫైబర్ మెగ్నీషియం,calcium, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. calcium, మెగ్నీషియం అనేవి ఎముకలకు బలాన్ని అందిస్తాయి.
డయాబెటిస్, రక్తపోటు ఉన్నవాళ్లు జొన్న పిండితో రొట్టెలు తింటే చాలా మంచిది. ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్న లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం లో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి సహాయపడి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. వారంలో రెండు సార్లు జొన్న పిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.
పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జొన్న పిండి మార్కెట్ లో దొరుకుతుంది. లేదా జొన్నలను తెచ్చుకొని పిండిగా చేసుకోవచ్చు. జొన్న పిండిలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ప్రోటీన్ సమృద్దిగా మన శరీరానికి అందాలంటే జొన్న పిండిని ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
జొన్న పిండిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. జొన్న పిండిలో మెగ్నీషియం, ఐరన్ మరియు విటమిన్లు B మరియు E వంటి పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జొన్నలో అధిక మొత్తంలో నియాసిన్ (లేదా విటమిన్ B3) ఉంటుంది.
ఇది నీరసం,అలసట, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఐరన్ మరియు రాగి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేయడంలో ఐరన్ కీలకం, అయితే శరీరంలో ఐరన్ శోషణను మెరుగుపరచడంలో రాగి సహాయపడుతుంది.
అందువల్ల, జొన్నలను తీసుకోవడం వలన ఎర్ర రక్త కణాల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత అవకాశాలను తగ్గించడంతోపాటు శరీరంలో మొత్తం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాబట్టి వారంలో రెండు సార్లు జొన్నలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.