అంజీర్,తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Anjeer and honey benefits In Telugu : అంజీర్,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రి సమయంలో ఒక అంజీర్ ని నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి అరస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.
ఈ సీజన్ లో తీసుకోవటం వలన అనేక వ్యాధుల నుండి బయట పడవచ్చు. అంజీర్ లో ఫైబర్, కాపర్, ఐరన్ మరియు విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అంజీర్ ని తేనెతో కలిపి తినటం వలన అధిక బరువు తగ్గుతారు.
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. ఒత్తిడి మరియు డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ మిశ్రమంను తీసుకుంటే ప్రశాంతత కలుగుతుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో ఉండే గుణాలు ఎముకలలో నొప్పి మరియు కీళ్ల వాపులను తగ్గిస్తుంది.
గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రోజుకి ఒకసారి అంజీర్ తో తేనె కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అంజీర్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఖచ్చితంగా ఈ మిశ్రమంను తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ మిశ్రమం ఒక సంజీవని వంటిది అని చెప్పవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.