రాత్రి సమయంలో ఆపిల్, అరటి పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?
Apple And Banana health benefits In telugu : ఆరోగ్యకరమైన ఆహారాలను సరైన సమయంలో తింటేనే మన శరీరానికి ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది. మన రోజూవారి ఆహారంలో సాధ్యమైనంత వరకు నూనె,మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం మానేయలి.
అలాగే పోషకాలు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆర్గానిక్ పండ్లు,కూరగాయలు తినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాక ఏ సమయంలో ఏ ఆహారం తీసుకుంటే మన శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. మంచి పోషకాలు మన శరీరానికి అందేలా చూసుకోవాలి.
అరటిపండు సంవత్సరం పొడవునా చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ కంటే అరటిపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అరటిపండులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందాలంటే ప్రతి రోజు ఒక అరటిపండు తింటే సరిపోతుంది. అరటిపండులో ఎన్నో లాభాలు ఉన్నప్పటికి సరైన సమయంలో తినకపోతే కొన్ని సమస్యలు వస్తాయి.
రాత్రి భోజనం చేసిన తర్వాత అరటిపండు తినడం వల్ల ఛాతీలో కఫం పేరుకుపోయే అవకాశం ఉందని, ఒక్కోసారి అజీర్ణ సమస్య వచ్చే అవకాశం ఉందని.. అయితే వ్యాయామానికి ముందు తినవచ్చని అంటున్నారు. అలా కుదరని వారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తినవచ్చు. అరటిపండు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని నిపుణులు చెప్పుతూ ఉంటారు. ఆపిల్ కాస్త ధర ఎక్కువైన…ఆపిల్ లో అనేక రకాల పోషకాలు, మినరల్స్, విటమిన్లు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ లో పెక్టిన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను మరియు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ పండును మితంగా తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి భోజనం తర్వాత ఈ పండును తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం మరియు మధ్యాహ్నం తీసుకునే ఆహారం కంటే రాత్రి తీసుకునే ఆహారం తక్కువగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.