1 గ్లాసు శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు
Bey leaf Weight Loss Drink In Telugu : ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు పెరగడం అయితే చాలా స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అయిపోతుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే కచ్చితంగా నెల రోజుల్లో బరువు తగ్గుతారు.
అసలు బరువు పెరగడానికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, ఒత్తిడి, కొన్ని రకాల మందులు వాడటం, సరైన నిద్ర లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. ఆ కొవ్వు కారణంగా పొట్ట లావుగా తయారవుతుంది. ఇలా లావుగా తయారైన పొట్టను తగ్గించుకోవడానికి ఇప్పుడు .చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక అందులో ఒక స్పూన్ ధనియాలు, ఐదు నుంచి ఆరు తాజా పుదీనా ఆకులు, రెండు బిర్యాని ఆకులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. .
ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో కూడా తాగవచ్చు. అయితే ఉదయం సమయంలో తాగితేనే మంచి ఫలితాలను అందుకోవచ్చు. శరీరంలో జీవక్రియ రేటు బాగా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు ఏమి రావు. కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగితే అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. ఈ డ్రింక్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.