Healthhealth tips in telugu

చియా గింజలు Vs జనపనార గింజలు…రెండింటిలో బరువు తగ్గించటానికి ఏది బెస్ట్…?

Chia Seeds Vs Hemp seeds weight Loss Benefits : చియా గింజలు మరియు జనపనార గింజలలో పోషకాలు చాలా సమృద్దిగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
chia seeds
ఈ Super Seeds బరువును తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనలో చాలా మందికి చియా మరియు జనపనార గింజలలో బరువు తగ్గటానికి ఏది బెస్ట్ అనే సందేహం ఉంటుంది. పోషకాల విషయానికి వస్తే…100 గ్రాముల చియా విత్తనాలలో 16.5 గ్రాముల ప్రోటీన్, 42.1 గ్రాముల పిండి పదార్థాలు, 34.3 గ్రాముల ఫైబర్, 30.7 గ్రాముల కొవ్వు మరియ చక్కెర అసలు ఉండదు.
Hemp Seeds benefits
అధిక-ప్రోటీన్, అధిక-ఫైబర్ పోషకాల కలయిక బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. అలాగే అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఈ గింజలలో ఉన్న పోషకాలు ఎన్నో రకాల సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి.
Weight Loss tips in telugu
100 గ్రాముల జనపనార విత్తనాలలో 31.6 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల ఫైబర్, 8.7 గ్రాముల పిండి పదార్థాలు, 49 గ్రాముల మొత్తం కొవ్వు మరియు 1.5 గ్రాముల చక్కెర ఉంటాయి. ఈ గింజలలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్దిగా ఉంటాయి. బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడతాయి. చియా గింజలతో పోలిస్తే ఫైబర్ తక్కువగా ఉంటుంది.
weight loss drink
100 గ్రాముల చియా గింజలలో 486 కేలరీలు ఉంటే…జనపనార గింజలలో 553 కేలరీలు ఉంటాయి. చియా మరియు జనపనార గింజలలో బరువు తగ్గటానికి ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే…చియా మరియు జనపనార గింజలు రెండూ గొప్ప పోషక విలువలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, జనపనారలో చియా గింజల కంటే ఎక్కువ ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

చియా గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రెండూ కూడా మంచి పోషకాలు ఉన్న గింజలు. కానీ రెండూ బరువు తగ్గడానికి భిన్నంగా సహాయపడతాయి. వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి, కాబట్టి మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే రెండింటిలో ఏది వాడినా మంచి ప్రయోజనం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.