ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు
Foods that lower cholesterol In Telugu : ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ రెండు ప్రధాన రకాలు– తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL)…ఇది చెడు కొలెస్ట్రాల్. మరొకటి అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), ఇది మంచి కొలెస్ట్రాల్..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ధమనులలో రక్తప్రవాహానికి అడ్డుపడి గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కారణం అవుతుంది. అధిక కొలెస్ట్రాల్ అనేది వారసత్వంగా కూడా రావచ్చు. మన జీవనశైలిని మార్చుకొని ఆహారంలో మార్పులు చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఆహారాలను తెలుసుకుందాం.
ఒట్స్ మరియు బార్లీ కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. ఒట్స్ మరియు బార్లీలో బీటా గ్లూకాన్ అని పిలువబడే ఒక రకమైన కరిగే ఫైబర్ సమృద్దిగా ఉంటుండ్. ఇది సిస్టమ్ లో పెరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిని తీసుకోవటం వలన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20% తక్కువగా ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది.
బాదం,వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు,మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. రెండు ఔన్సుల గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల 5% చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 28% తక్కువగా ఉంటుంది.
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోండి. మన జీవనశైలిని మార్చుకొని మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.