ఉదయాన్నే 1 స్పూన్ తింటే ఒంట్లో రక్తం పెరగటమే కాకుండా పొట్ట తగ్గి గ్యాస్ ట్రబుల్ రాదు
protein Laddu : ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. సమస్య చిన్నగా ఉంటే ఇంటి చిట్కాలతో పరిష్కారం చేసుకోవచ్చు. అసలు సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే పొడిని ప్రతి రోజు తీసుకుంటే సరిపోతుంది. ఈ పొడి ఒక్కసారి తయారుచేసుకుంటే నెల రోజుల వరకు వాడవచ్చు.
ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు పెసలు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు పాన్ లో వేసి వేగించాలి. కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో బెల్లం కలిపి లడ్డుగా చేసుకొని తినవచ్చు. గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి తాగవచ్చు. ఏ సమయంలోనైనా తాగవచ్చు.
ఉదయం సమయంలో తాగితే రోజంతా అలసట,నీరసం,నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది. అలాంటి వారు ఈ పొడిని ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.
అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు కూడా తగ్గుతారు.బాదంపప్పు, పెసలు, వేరుశనగ గుళ్ళు మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాస్త ఓపికగా ఈ పొడిని తయారుచేసుకుంటే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.