ఒక్క రోజులోనే గొంతు నొప్పి, గొంతులో గరగర, గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు తగ్గిపోతుంది
Cold and Cough Home remedies In telugu :ప్రస్తుతం మారిన ఈ సీజన్ లో విపరీతమైన మంచు ఉంది. ఈ మంచులో ఒక్కసారి బయటికి వెళితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి రావడం ఖాయం. వీటిని తగ్గించుకోవటానికి మంచి ఇంటి చిట్కా ఉంది. ఇవి ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా కోసం ఒక తమలపాకు మీద చిన్న ఉల్లిపాయ ముక్క, రెండు మిరియాలు, నాలుగు తులసి ఆకులు వేసి పొట్లం కింద చుట్టి తినాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు తింటే దగ్గు., జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ అన్ని తగ్గిపోతాయి.
అంతేకాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన గొంతుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. మిరియాలలోని యాంటీ సెప్టిక్ లక్షణాలు దగ్గు,జలుబు,జ్వరంలను తగ్గించటంలో సహాయపడతాయి. మిరియాలు శరీరంలో మాక్రోఫేజ్ (ఒక రకమైన తెల్ల రక్త కణాలు) ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
ఇది రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే మన శరీరానికి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన శరీరాన్ని ఇన్ ఫెక్షన్స్ బారి నుండి కాపాడి దగ్గు,గొంతు నొప్పి,గొంతు గరగర తగ్గించటంలో సహాయపడుతుంది.
ఉల్లిలో ఉన్న లక్షణాలు కూడా గొంతుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఈ చిట్కా ఈ సీజన్ లో వచ్చే సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రెమిడీ ఫాలో అయ్యి దగ్గు,జలుబు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.