డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రింక్ తాగితే షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది
Daibetes control drink In Telugu : ప్రస్తుతం ఉన్న రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే మనలో చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఈ డ్రింక్ తయారుచేసుకోవటం చాలా సులువు. ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు పెరుగు, అర స్పూన్ మెంతుల పొడి, 1/4 స్పూన్ వేగించిన జీలకర్ర పొడి, అర స్పూన్ మునగాకు పొడి, రెండు స్పూన్ల నిమ్మరసం, చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే డయాబెటిస్ నియంత్రణలో ఉంచే డ్రింక్ రెడీ అయినట్టే. ప్రతిరోజు ఒక గ్లాసు తాగితే డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా నీరసం, అలసట ఏమీ లేకుండా చేస్తుంది. శరీరం డిటాక్సిఫికేషన్ అవుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు.
అంతేకాకుండా తలనొప్పి, ఒత్తిడి వంటివి ఏమీ లేకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారిలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
కాబట్టి ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో ఇలా డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ రెమిడిలో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు డయాబెటిస్ నిర్వహణలో సహాయపడతాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ డ్రింక్ చేసుకొని తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.