Healthhealth tips in telugu

పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

Piles Problem : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి.
piles home remedies
పైల్స్ కు ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక, బయటకు విసర్జింపబడక ఇబ్బందులు పడవలసి వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి.
Anjeer benefits
ఈ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. నీరు ఎక్కువగా తాగాలి. గంటల తరబడి ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యలో లేస్తూ ఉండాలి. రాత్రి సమయంలో రెండు అంజీర పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన అంజీరను తింటూ ఆ నీటిని తాగాలి.
Onion beaUTY tIPS
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, అరస్పూన్ పంచదార కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలిపి తాగాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావుస్పూన్ జీలకర్ర పొడి వేసి తాగితే జీర్ణ ప్రక్రియ బాగా సాగి మలవిసర్జన సాఫీగా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.