ఈ పాలను ఇలా తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
Mint Coconut Milk Benefits In telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్య రాగానే మనలో చాలామంది మందులు వేసుకుంటూ ఉంటారు.
అలా కాకుండా సహజ సిద్ధంగా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు చెప్పే పాలను తీసుకుంటే మలబద్ధకం, నిద్రలేమి వంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి రెండు గ్లాసుల నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసి దాని నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేయాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో 12 తాజా పుదీనా ఆకులను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం., అర స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత తయారుచేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే .Mint కోకోనట్ Milk రెడీ అవుతుంది.
ఎన్నో పోషకాలు ఉన్న ఈ జ్యూస్ తాగితే జీర్ణసంబంధ సమస్యలు అన్ని తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా గ్యాస్., ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో ఈ పాలను తీసుకుంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. .
సీజన్ మారినప్పుడు వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా దగ్గు., జలుబు వంటి శ్వాస కోసం తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నోటి పూత., నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంతమందికి విపరీతమైన ఆకలి వేస్తుంది. అలాంటివారు ఈ పాలను తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. .
అలాగే మెదడు షార్ప్ గా పని చేయడానికి కూడా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఈ పాలను తయారు చేసుకుని ఒక వారం రోజులు పాటు తాగి మరల ఒక వారం గ్యాప్ ఇచ్చి ఇంకొక వారం తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.