రోజుకి 3 తింటే రక్త నాళాల్లో అడ్డంకులు,చెడు కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమస్యలు ఉండవు
Health Benefits Of Hazelnuts In Telugu: మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలు కలుగుతాయి. ఈ రోజు Hazelnuts గురించి తెలుసుకుందాం. రోజులో 3 నట్స్ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగి రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో అన్నీ రకాల నొప్పులను తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే మాంగనీస్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరచి ధైరాయిడ్ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
అలాగే వాటిల్లో ఉండే ప్రొ ఆంథోసయనిడిన్స్ పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. Hazelnuts లో విటమిన్ E,ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు లేకుండా చేయటమే కాకుండా మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
Hazelnuts లో సి మరియు ఇ వంటి ముఖ్యమైన విటమిన్లు మరియు మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి, ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాక వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
ఈ నట్స్ బరువు తగ్గటానికి కూడా సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ నుండి సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన వాపు,మంటను తగ్గించటానికి సహాయపడుతుంది. అలెర్జీ ఉన్నవారు ఈ నట్స్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
నట్స్‌లో ఉండే అధిక మొత్తంలో ప్రోటీన్, జింక్ మరియు సెలీనియం స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.టానిన్లు మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉండుట వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.