మందులు లేకుండా నిమిషంలో దగ్గు, జలుబు,గొంతు నొప్పి,గొంతు వాపు మాయం
cough home remedies in telugu : దగ్గు, జలుబు, చాతిలో వచ్చే ఇన్ఫెక్షన్, శ్లేష్మం తగ్గటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ చిట్కా కోసం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి . దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తాము.
ఎందుకంటే గొంతులో ఏ కాస్త తేడా ఉన్నా గడబిడ ఉన్న చాలా ఇబ్బందిగా ఉండి నిరసించి పోతాం. ఎందుకంటే దగ్గు, జలుబు అనేవి మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు రావటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. దగ్గు జలుబు ఉందంటే ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు అలా వరుసగా వచ్చేస్తాయి. అందువల్ల దగ్గు, జలుబు వచ్చింది అంటే మనం ఎలర్ట్ అయిపోవాలి.
ఈ చిట్కా కోసం ఒక పాన్ లో ఒక స్పూన్ లవంగాలు, ఒక స్పూన్ మిరియాలు వేసి వెగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో తయారుచేసి పెట్టుకున్న పొడిని అరస్పూన్ వేసి, దానిలో పావుస్పూన్ లో సగం శొంఠి పొడి, పావుస్పూన్ లో సగం పసుపు, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పెద్దవారు అయితే ఒక స్పూన్ మోతాదులో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. చిన్న పిల్లలు అయితే అరస్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇలా 2 రోజులు తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్ అన్నీ తగ్గిపోతాయి. లవంగాలు,మిరియాలు కలిపి చేసుకున్న పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఎక్కువ మోతాదులో చేసుకొని డబ్బాలో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా రోగనిరోదకశక్తి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.