ఎర్ర కలబంద గురించి ఈ విషయాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం
Red Aloe Vera Benefits In telugu : మనం కలబందను ఎక్కువగానే ఉపయోగిస్తాం. కలబందలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆకుపచ్చ రంగులో ఉన్న కలబంద గురించి మనకు తెలుసు. ఆకుపచ్చని కలబంద దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కానీ ఎరుపు రంగులో ఉండే కలబంద గురించి మనకు పెద్దగా తెలియదు.
ఎరుపు రంగు కలబందలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఎర్ర కలబంద ఆకుపచ్చని కలబందతో పోలిస్తే ఎక్కువ శక్తివంతమైనది. ఎర్ర కలబందలో విటమిన్ లు,ఖనిజాలు,అమినో యాసిడ్స్ మరియు పాలీశాకరైడ్లు సమృద్దిగా ఉంటాయి. ఇక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి బాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎర్ర కలబంద చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
ఎర్ర కలబంద జెల్ ని ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలను తొలగిస్తుంది. ఈ జ్యూస్ తాగితే శరీరంలో విషాలు అన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఈ జ్యూస్ తాగటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఇబ్బంది పడే స్త్రీలు ఎర్ర కలబంద రసం తాగాలి. దీంతో వారికి మేలు జరుగుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ సక్రమంగా రావడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. ఎర్ర కలబంద జ్యూస్ ని జుట్టుకి పట్టిస్తే జుట్టు కాంతివంతంగా మెరవటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
ఎర్ర కలబందలో ఉండే కొల్లాజెన్ యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. దీనితో పాటు, ఇది చర్మాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాల కలయిక మొటిమలకు వ్యతిరేకంగా మంచి ప్రభావాన్ని చూపుతుంది. దీని జెల్‌ను యాంటీ ఫంగల్‌గా ఉపయోగించవచ్చు మరియు ఇది జుట్టు నుండి చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.