2 రూపాయల ఖర్చుతో ఇలా చేస్తే డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు జీవితంలో ఉండవు
Weight Loss Tips In telugu :ఈ రోజుల్లో మారిన జీవన శైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం,వ్యాయామం చేయకపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అంతేకాక ఈ మధ్య కాలంలో డయాబెటిస్ అనేది కూడా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఆదిక బరువు,డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచటానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి.
మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే మెంతులు ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. మెంతులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం అన్నీ రకాలుగా మంచిది. మెంతులను వేగించి పౌడర్ గా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడి కలిపి తాగాలి.
లేదంటే పొయ్యిమీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ మెంతులను వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి వడకట్టి ఆ నీటిని తాగాలి. లేదంటే ఒక స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగడం వలన అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.
ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సంబంద సమస్యలు అయిన కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు మెంతులను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.