ఈ పొడిలో ఎన్నో ఊహించని ప్రయోజనాలు…ముఖ్యంగా నరాల బలహీనత ఉన్నవారికి…
Mango Seed Powder Benefits In telugu : మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి Mango seed Powder చాలా బాగా సహాయపడుతుంది. ఈ పొడిలో విటమిన్ B12 సమృద్దిగా ఉంటుంది. ఈ పొడి కాస్త చేదు,వగరుగా ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడి,ఒక స్పూన్ తేనె కలిపి తాగవచ్చు.
లేదంటే చపాతీ,అట్లు వేసుకొనే సమయంలో Mango Seed Powder ని కలపవచ్చు…లేదంటే ప్రతి రోజు మనం చేసుకొనే కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి నరాల బలహీనత వంటి నరాలకు సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. మెదడు నరాలు కుచించుకు పోకుండా చేసి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
మెదడుకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ పొడిని వాడటం వలన విటమిన్ B12 లోపం కూడా ఉండదు. అలాగే ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య కూడా ఉండదు. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గటమే కాకుండా అలసట,నీరసం అనేవి కూడా ఉండవు.
ఈ పొడిలో 9 రకాల అమినో యాసిడ్స్ మరియు Calcium సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా చిగుళ్ళకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
జీవక్రియ రేటును పెంచి అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారిలో కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ల చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గొంతులోని బ్యాక్టీరియా మరియు వైరస్‌లను నిర్మూలిస్తుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ Mango Seed Powder వేసి బాగా కలిపి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పొడి ఆయుర్వేదం షాప్ లలో లభ్యం అవుతుంది. చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Mango Seed Powder లో నీటిని కలిపి పేస్ట్ గా చేసి జుట్టుకి బాగా పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఈ పొడిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
ఈ పొడిలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను తగ్గిస్తుంది. ఒక స్పూన్ mango seed powder లో ఒక స్పూన్ టమోటా పేస్ట్ కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ పొడిని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.