డయాబెటిస్ ఉన్నవారు బియ్యం నీటిని తాగితే….ఏమి జరుగుతుందో తెలుసా ?
Rice Water Benefits in Telugu : బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే మనలో చాలా మందికి ఈ ప్రయోజనాల గురించి తెలియక ఆ నీటిని బయట పారపోస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆ నీటిని పారవేయకుండా ఉంటారు.
బియ్యం కడిగిన నీటితో డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరంలో శక్తి స్థాయిలు పెరగడానికి సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. బరువు తగ్గేలా చేసి శరీరంలో శక్తి నిల్వలు పెరిగేలా చేస్తుంది.
రెగ్యులర్ గా బియ్యం నీటిని తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ నీటిని తీసుకుంటూ కొంత వ్యాయామం కూడా చేయాలి. ఇలా చేస్తే తొందరగా ఫలితం కనబడుతుంది. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే ముఖం మీద ఉన్న ముడతలు అన్నీ పోతాయి. ఈ నీటిని జుట్టుకు రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
ఇక ఇప్పటి నుండి బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా ఉపయోగించుకోండి. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.