7 రోజుల పాటు ఉదయం వెల్లుల్లి, తేనె కలిపి తింటే ఏమి అవుతుందో తెలుసా?
Garlic Benefits :మీరు తరచుగా అలసిపోతున్నారా ? ఎలాంటి కారణం లేకుండా.. తీవ్రంగా నీరసించిపోతున్నారా ? ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే.. మీ వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కోల్పోతోందని సంకేతం. ఆరోగ్యంగా ఉండాలంటే.. స్ట్రాంగ్ ఇమ్యున్ సిస్టమ్ చాలా అవసరం. అది బలహీనమయ్యే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
వెల్లుల్లి, తేనె రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా.. ఏడు రోజు తీసుకోవాలి.
ఇమ్యునిటీ
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా పరగడుపున తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా.. అరికడుతుంది.
కరోనరీ డిజార్డర్స్
కరోనరీ డిజార్డర్స్ అంటే.. రక్తం గడ్డకట్టడం. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ ని తొలగించి.. గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.
గొంతు నొప్పి
వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
డయేరియా
ఈ పవర్ ఫుల్ పేస్ట్ డయేరియాని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్ లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
జలుబు
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్ ను ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్
వెల్లుల్లి, తేనె రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది.
డిటాక్స్
వెల్లుల్లి, తేనె మిశ్రమం తీసుకోవడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది. హెల్తీగా ఉంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.