లెమన్ టీ ఎప్పుడైనా తాగారా…ముఖ్యంగా ఈ సీజన్ లో…ఎన్నో లాభాలు…!
Lemon Tea Benefits In telugu : ఉదయం లేవగానే మనలో చాలా మంది Tea లేదా Coffee తాగుతూ ఉంటారు. అలా కాకుండా Lemon Tea తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లెమన్ టీ అంటే పొయ్యి మీద ఒక గ్లాసు నీటిని పోసి మరిగించి పొయ్యి ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత అరస్పూన్ టీ ఆకు లేదా గ్రీన్ టీ పొడి వేసి మూత పెట్టాలి. పది నిమిషాలు అయ్యాక నీటిని వడకట్టి అరచెక్క నిమ్మరసం,అరస్పూన్ తేనె కలిపితే లెమన్ టీ రెడీ అయినట్టే. ఈ టీని వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. లెమన్ టీ ఒక అద్భుతమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.
శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్ వివిధ ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. లెమన్ టీలోని సిట్రిక్ యాసిడ్ కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది. గొంతులోని శ్లేష్మాన్ని తగ్గించి ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ సీజన్ లో ఈ టీ తాగితే గొంతు సమస్యలకు మంచి ఉపశమనం కలుగుతుంది.
నిమ్మలో ఉండే ఫ్లేవనాయిడ్లు, సిట్రిక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి. నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఆందోళన,ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది టాక్సిన్స్ మరియు వ్యర్థ ఉత్పత్తులను తొలగిస్తుంది, మీ శరీరం ఆహారంలోని ప్రయోజన కరమైన సమ్మేళనాలను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. నిమ్మకాయలలోని హెస్పెరిడిన్ మరియు డయోస్మిన్ వంటి ఫ్లేవనాయిడ్‌లు రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నిమ్మకాయలోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ లెమన్ టీని వారంలో మూడు సార్లు తాగటానికి ప్రయత్నం చేయండి. పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.