Healthhealth tips in telugu

వీటిని ఇలా తీసుకుంటే రక్తం గడ్డకట్టకుండా పలుచగా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

Blood Thinning Foods : గుండె సమస్యలు లేకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్తం పల్చగా ఉండి రక్తం గడ్డకట్టకుండా ఉంటే సరిపోతుంది. రక్తం చిక్కగా ఉన్నప్పుడు ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్‌, ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు, ప్రోటీన్స్ క‌లిసి ర‌క్తం గ‌డ్డ క‌ట్టేలా చేస్తాయి.

దీంతో ర‌క్త నాళాల్లో రక్తం గ‌డ్డ క‌డుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు వ‌స్తాయి. అయితే ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ప‌లుచ‌గా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉంటుంది. కాస్త ఓపికగా ఈ ఆహారాలను తీసుకోవాలి.
beetroot juice
బీట్ రూట్ జ్యూస్ తాగితే బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ రక్తం గడ్డకట్టకుండా పల్చగా ఉండేలా చేయడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తగిన మూడు గంటల్లోనే నైట్రేట్స్ లెవల్స్ పెరుగుతాయి. అందువల్ల ప్రతి రోజు బీట్ రూట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు.
tomato benefits in telugu
టమోటా కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. టమోటాలో ఉండే క్లోరోజెనిక్‌, ఫెర్యులిక్ వంటి మూల‌కాలు ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్ గ‌డ్డ క‌ట్ట‌కుండా నిరోధిస్తాయి. దాంతో రక్తం పలుచగా ఉంటుంది. రోజు ఒక టమోటాను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకొని తాగవచ్చు.
dark chocolate benefits in telugu
డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండేలా చేస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్‌ల‌లో కోకోవా ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న రక్తం పలుచగా ఉండేలా చేసి గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Onion beaUTY tIPS
ఉల్లిపాయలో స‌ల్ఫ‌ర్ తోపాటు అడెనోసిస్‌, అల్లిసిన్‌, పారాఫినిక్ పాలీస‌ల్పైడ్స్ వంటి మూల‌కాలు సమృద్దిగా ఉండుట వలన రక్తం పలుచగా ఉండేలా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేయటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.