అర స్పూన్ పొడి ఇలా తీసుకుంటే అరి కాళ్ళల్లో మంటలు,తిమ్మిర్లు ఉండవు….ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు
Cure leg cramps in diabetic patients : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడ వలసిందే. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఆయుర్వేద చిట్కా పాటిస్తే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా అరి కాళ్ళల్లో తిమ్మిర్లు,మంటలు వస్తూ ఉంటాయి.
ఒక్కోసారి అరికాళ్లు స్పర్శ కోల్పోవటం,బరువుగా ఉండటం, బ్యాలన్స్ కోల్పోవటం, నిలబడలేకపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో ఒక మంచి రెమిడీ ఉంది. 50 గ్రాముల అశ్వగంధ పొడి, 50 గ్రాముల మంజిష్ట, 50 గ్రాముల పసుపు తీసుకొని మూడు బాగా కలిసేలా కలుపుకొని సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.
ఉదయం సమయంలో పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు తాగితే సరి పోతుంది. ఇది తీసుకున్న తర్వాత అరగంట వరకు ఏమి తినకూడదు…తాగకూడదు. డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పొడి సహాయపడుతుంది.
ప్రతి రోజు తాగటం వలన ఆరి కాళ్ళల్లో తిమ్మిర్లు,మంటలు తగ్గుతాయి. అశ్వగంధ పొడి,మంజిష్ట అనేవి ఆయుర్వేదం షాప్ లో సులభంగానే లభ్యం అవుతాయి. కాబట్టి ఈ రెమిడీ ఫాలో అయ్యి మంచి ఫలితాన్ని పొందండి. ఏదైనా సమస్యను ప్రారంభంలో గుర్తించి పరిష్కారం చూసుకోవటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.