Healthhealth tips in telugu

ఈ గింజలలో ఉన్న రహస్యం తెలిస్తే అసలు పాడేయరు…ముఖ్యంగా ఆ సమస్యలకు…

Health Benefits Of Amla Seeds : ఉసిరికాయను ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పరిగణిస్తారు. విటమిన్-సి సమృద్దిగా ఉండే ఉసిరి కాయతో పాటు, దాని విత్తనాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది దాదాపు 20 వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.ఉసిరి గింజలలో పొటాషియం, కాల్షియం, విటమిన్-బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్ మరియు ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
Health Benefits Of Amla Seeds
ఉసిరి గింజలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో నీటిని కలిపి పేస్ట్ గా చేసి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ లో సగం పొడిని వేసి బాగా కలిపి తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
ekkillu In English
ఎక్కిళ్లు వచ్చాయంటే ఒక్క పట్టానా తగ్గవు. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు తేనెలో ఉసిరి గింజల పొడి కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. వేసవి కాలంలో చాలా మందికి ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఉసిరి గింజలలో నీటిని పోసి గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను నుదిటిపై అప్లై చేసి నేరుగా పడుకోండి. ఇది మీ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది మరియు ఉపశమనం లభిస్తుంది.
sleeping problems in telugu
10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి, వాటిని మెత్తగా పొడిగా తయారు చేస్తారు. ఇప్పుడు అందులో 20 గ్రాముల పటికబెల్లం పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో అర టీస్పూన్ పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగుతూ ఉంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.