1 గ్లాసు రక్తప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా రక్తం శుద్ది, వృద్ది అవుతాయి
Blood Circulation Drink : మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం బాగుందని చెప్పవచ్చు. రక్త ప్రసరణ సరిగా లేకపోతే అధిక బరువు,డయాబెటిస్, రక్తం గడ్డ కట్టటం,తిమ్మిరి,కండరాల తిమ్మిరి,అవయవాలలో నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగాలంటే కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి.
ఇలా తీసుకుంటే రక్తప్రసరణ మెరుగు పడటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు. మిక్సీ జార్ లో ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, గుప్పెడు పుదీనా ఆకులు,గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు తులసి ఆకులను వేసి ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసి వడకట్టి తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే రక్తంలో మలినాలు తొలగిపోయి శుద్ది అవుతుంది.
అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా మందుల మీద ఆధారపడకుండా ఇటువంటి ఆహారాలను తీసుకుంటూ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ డ్రింక్ తాగితే ఫలితం చాలా తొందరగా వస్తుంది.
ఆనపకాయ మనకు సంవత్సరం పొడవునా లభిస్తుంది. పుదీనా,కొత్తిమీర ఈ సీజన్ లో చాలా విరివిగానే లభ్యం అవుతాయి. తులసి మొక్క దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగితే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. కాబట్టి తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.