మహానటి మూవీ లో ఎన్టీఆర్ పాత్ర చేసింది ఎవరో తెలుసా?
మహానటి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్,దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలుగా నటించిన మహానటి సినిమా కనివిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. మే 9 న విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామి సృష్టిచింది. మహానటిగా పేరొందిన సావిత్రి సినీ ప్రస్థానంలో ఎందరో మహానుభావులకు చోటు ఉంది. ఆ పాత్రలకు ప్రముఖ నటీనటులు,దర్శకులతో చేయించాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. సమంతా, విజయ్ దేవరకొండ,మోహన్ బాబు,క్రిష్,ప్రకాష్ రాజ్,తరుణ్ భాస్కర్ తదితరులు నటించారు. సావిత్రి సినీ జీవితంగా ముఖ్యంగా ఎన్టీఆర్,ANR పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సావిత్రి వీరిద్దరితో చాలా సినిమాలు చేసింది.
అయితే ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య పోషించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఎన్టీఆర్ పాత్ర వద్దకు వచ్చేసరికి దర్శకుడు నాగ్ అశ్విన్ కు సవాల్ ఎదురైంది. ఆ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలని నిర్ణయించుకోగా, తాను ఆ మహనీయుడి పాత్రలో నటించడం ఈ జన్మకు జరగని పని అంటూ యంగ్ టైగర్ తేల్చేశాడు. దాంతో చేసేది లేక నాగ్ అశ్విన్ సీనియర్ ఎన్టీఆర్ ను డిజిటల్ పద్ధతిలో తెరపై ఆవిష్కరించాడు.
ఈ విషయంలో సూర్య అనే థియేటర్ ఆర్టిస్టు ఓ వరంలా దొరికాడు మహానటి చిత్రబృందానికి. ఎన్టీఆర్ హైట్, అచ్చం అదే రూపురేఖలతో కనిపించే సూర్యతో కొన్ని సీన్లు షూట్ చేయించాడు నాగ్ అశ్విన్. ఎడిటింగ్ లో సూర్య ముఖంపై ఎన్టీఆర్ ఫేస్ ను సూపర్ ఇంపోజ్ చేయించి తెరపై కనిపిస్తున్నది ఎన్టీఆరే అన్నంతగా భ్రమింపజేశాడు.
కర్రసాము చేస్తూ సీనియర్ ఎన్టీఆరే దిగివచ్చాడా అనేంతగా ఆ పాత్రలో లీనమైపోయాడు థియేటర్ ఆర్టిస్ట్ సూర్య. అచ్చం ఎన్టీరామారావు బాడీ లాంగ్వేజ్ ను ప్రదర్శించడంతో చూసినవాళ్లకు ఏమాత్రం సందేహం రాలేదు. ఈ క్రెడిట్ నిస్సందేహంగా దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీమ్ కే దక్కుతుంది.
హాలీవుడ్ లో ఉపయోగించే మోస్ట్ అడ్వాన్స్ డ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఎన్టీఆర్ సీన్ల కోసం వాడుకున్నారు. దాంతో ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా సూర్య ముఖంపైకి ఎన్టీఆర్ ముఖాన్ని డంప్ చేసి సక్సెస్ అయ్యారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ అంటే మహానట శిఖరం అని చెప్పుకుంటారు. అలాంటి మహానుభావుడి పాత్రను పోషించడం తనకు సాధ్యం కాదని సాక్షాత్తు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆరే పేర్కొన్న నేపథ్యంలో జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఎంతో ధైర్యంగా ఆ రోల్ పోషించిన సూర్యను మహానటి చిత్ర యూనిట్ మొత్తం అభినందించింది.
సినిమా చూసిన వాళ్లకు ఎన్టీఆర్ రూపంలో తెరపై కనిపిస్తున్నది ఓ జూనియర్ ఆర్టిస్ట్ అనే సందేహమే రాలేదంటే అందుక్కారణం సూర్య పడిన శ్రమ అనిచెప్పుకోవాలి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను బాగా వంటబట్టించుకుని ఆ పాత్రలో లీనమైపోయాడు. త్వరలోనే తన లేటెస్ట్ ప్రాజెక్ట్ లో కూడా అతనికి అవకాశం ఇస్తానని దర్శకుడు నాగ్ అశ్విన్ సూర్యకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.